NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమ అరెస్టులు.. కక్ష సాధింపులు సరికాదు

1 min read

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు

  • జగన్ మోహన్ రెడ్డి ఎంత మంచి వాడో అంతే మెండి వాడు
  •  మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి

మంత్రాలయ, న్యూస్​ నేడు: అక్రమ అరెస్టులు కక్ష సాధింపు చర్యలు సరికాదని దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని జాగ్రత్త గా ఉండాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హెచ్చరించారు. మాజీ ఐఎఎస్ అధికారి ధనుంజయ్య రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టుల పై మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి స్పందించారు. ఆదివారం మంత్రాలయంలోని ఓ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని లిక్కర్ స్కాం  జరిగిందంటు విచారణ పేరుతో ఐఏఎస్ అధికారి ధనుంజయ్య రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ని అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులు తీసివేయడం, 4380 పర్మిట్ రూంలు రద్దు చేయడం జరిగిందని తెలిపారు.  టీడీపీ హయాంలో  25 వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని  సీఐడీ అధికారులు నిర్దారణ చేయడం జరిగిందని టీడీపీ హయాంలో 69 శాతం మద్యం అమ్మకాలు జరిగితే వైకాపా హయాంలో మద్యం అమ్మకాలు తగ్గుతు వచ్చాయన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు చేయలేక వైకాపా నేతలు, అప్పటి అధికారులు, సోషల్ మీడియా కార్యకర్తలు లక్ష్యంగా అక్రమ కేసులు పెట్టడమే కూటమి పనిగా పెట్టుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎంత మంచి వాడో…… అంతే మెండి వాడు….. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. .కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కేసులు, దాడులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకి రెట్టింపు స్థాయిలో రివైంజ్ ఉంటుందని హెచ్చరించారు. గ్రామాల్లో ఇబ్బందులు పడిన నాయకులు, కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వినే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *