అక్రమ అరెస్టులతో టిడిపి పార్టీ గెలుపును ఆపలేరు
1 min read– వై నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ ఆరేస్తున్న ఖండిస్తూ ఈరోజు కర్నూలులోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ పత్రిక సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ,ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశిట్టి వెంకటేశ్వర్లు ,తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ , బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు ,పరమేష్ ,యల్లప్ప ,అబ్బాస్,బాలు , సురేష్ గౌడ్, చంద్రబోస్ ,ప్రభాకర్ ,గణేష్ ,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూప్రజాస్వామ్య దేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసి రాజ్యాంగం ఈ భారతదేశానికి ఇచ్చాడు.దాంట్లో భాగంగాపాలక ప్రభుత్వం,ప్రతిపక్షాలు,ప్రజలు, అధికారులు,వ్యవస్థ, ఇవన్నీ ఉంటాయి కానీ ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఉంచి ఇతర రాష్ట్రాలకు దీటుగా మన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దిన నాయకున్ని తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం అని ఓర్వలేక ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి మా ఆది నాయకుడిని అరెస్టు చేపియడం దారుణం.ఈ సైకో వైసీపీ నాయకులను విసిగిపోయారు పిచ్చి పరాకాష్టకు చేరింది కాబట్టే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేపించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బ్లాక్ డే. ఈ వైసీపీ నాయకుల తప్పు తెలుసుకుని మా నాయకుడిని వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాము.సైకో ప్రభుత్వానికి తుడిచి పెట్టేంత వరకు నిద్రపోము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ వైపు ప్రజల యొక్క మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది రాబోయే ఎన్నికల్లో వైసిపి ఓటమి ఖాయం.