PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కదిరిలో రిపోర్టర్ల పై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

1 min read

– కౌతాళం మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
– ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) కౌతాళం మండల కమిటీ

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రం నందు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమనగా శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో మూడు రోజుల క్రితం సీఐ ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు చేసిన ఆందోళన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా మిత్రులు వెళ్ళారు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్ల ను పోలీసులు లాక్కొని దౌర్జన్యం చేశారు. అలాగే ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. సీఐ మధు రిపోర్టర్లను నానా దుర్భాషలాడుతూ దాడి చేయాలని పోలీసులకు ఉసిగొల్పారు. N TV రిపోర్టర్ షబ్బీర్ సెల్ ఫోన్ లాక్కున్నారు. ఘటనలో రిపోర్టర్ల పై కదిరి సీఐ తమ్మిశెట్టి మధు రివర్స్ కేసులు పెట్టారు. స్థానిక రిపోర్టర్లు షబ్బీర్, సోమశేఖర్, జాన్, బాబ్జాన్ లపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటివరకు ఘటనకు కారణమైన కదిరి సీఐ మధు పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్ల పై కేసులు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్సింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండిస్తోంది. కదిరి ఘటన రిపోర్టర్ల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము. రిపోర్టర్ల పై దాడులకు పాల్పడిన పోలీసుల పైన, అందుకు కారణమైన సీఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. మా విన్నపాన్ని మన్నించి జర్నలిస్టులకు న్యాయం చేస్తారని, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని కౌతాళం మండల తాసిల్దార్ గారికి తెలపడం.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ మండల అధ్యక్షులు విజయ్, మండల ప్రధాన కార్యదర్శి వలి భాష, మండల ఉపాధ్యక్షులు అంజి మరియు సాదిక్,మండల సహాయ కార్యదర్శి శివకుమార్, మరియు ఈరన్న,బలరాం, మరియు తాలూకా సహాయ కార్యదర్శి ఆరిఫ్, మరియు కార్యవర్గ సభ్యులు ముదుకప్ప,రామాంజనేయులు, అనిల్ కుమార్, హుసేని తదితరులు పాల్గొన్నారు.

About Author