NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి రాష్ట్ర అధ్యక్షునిపై అక్రమ కేసులు హేయమైన చర్య

1 min read

– మండల ఐ టీడీపీ ఛాంపియన్ యమల మణికంఠ

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో పోలీసులు విధులు నిర్వహించకుండా చోద్యం చూస్తున్న పోలీసుల తీరును వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మండల ఐటీడీపీ ఛాంపియన్ మణికంఠ చెన్నూరులో ఆదివారం విలేఖరుల మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు జనం పోటెత్తితే తోపులాట,తొక్కిసలాట జరగకుండా నియంత్రించాల్సిన పోలీసులు ఉత్సవ విగ్రహాల్లా దూరంగా నిలుచుకోవడం సిగ్గు చేటన్నారు,ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారని వాస్తవం చెప్పారని ఆయనపై అక్కసుతో ప్రభుత్వం ప్రోత్సాహంతో అక్రమ కేసులు పెట్టారు అని ఆరోపించారు,ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని , లోకేష్ పాదయాత్రతో వైసీపీ భూస్థాపితం కావడం తధ్యమని ఆయన అన్నారు.

About Author