NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయం అడిగితే అక్రమ కేసులు.. ప‌వ‌న్ తో రైతులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వన్ క‌ళ్యాణ్ ను రాజ‌ధాని ప్రాంత రైతులు క‌లిశారు. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన రాష్ట్ర కార్యాల‌యంలో పవ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసిన త‌మ స‌మ‌స్యలు చెప్పుకున్నారు. రాజ‌ధాని కోసం భూములు ఇస్తే.. త‌మ‌ని రోడ్డున ప‌డేశార‌ని, న్యాయం చేయ‌మంటే అక్రమ కేసులు పెడుతున్నార‌ని రైతులు ఆవేద‌న వ్యక్తం చేశారు. రైతుల‌ను ప్రభుత్వ కార్యాల‌యాల చుట్టూ తిప్పుకుంటున్నార‌ని వాపోయారు. ఇప్పుడు సీఐడీ కార్యాల‌యానికి రావాలంటూ నోటిసులు ఇస్తున్నార‌ని ప‌వ‌న్ తో చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌ధాని ఇక్కడే ఉంటుంద‌ని చెప్పి మోసం చేశార‌ని రైతులు ఆవేద‌న వ్యక్తం చేశారు. రాజ‌ధాని రైతుల‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.

About Author