PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు వెంబడి అక్రమ నిర్మాణాలు.. నిర్లక్ష్యంలో అధికారులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంపౌండ్ వెంబడి అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేస్తుండడంతో పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది పంచాయతీ అధికారులు పన్ను కట్టించుకొని అక్రమంగా డ్రైనేజీ కాలువలపై అనుమతులు ఇవ్వడంతో బాడుగ లేకుండా వ్యాపారం చేసుకోవచ్చనే ఉద్దేశంతో శాశ్వత నిర్మాణాల శైలిలో సొంత స్థలంలో ఏర్పాటు చేసినట్టు నిర్మాణాలు చేసుకుంటున్నారు శబ్ద కాలుష్యం వల్ల రోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న మామూళ్ల మత్తులో పంచాయతీ అధికారులు మునిగితేలుతుండంతో సమస్యలు గాలికి వదిలేయడంతో అధికారుల పాలన ఇదేం పాలనర బాబు అని మండల ప్రజలు చెవులు కోరుకుంటున్నారు ముఖ్యంగా వచ్చే నెల మూడో తేదీ నుంచి మండలంలో రెండు సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సందర్భంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సెంటర్లో చుట్టుపక్కల షాపులు ఉండడంవల్ల 144 సెక్షన్ ఎలా విధిస్తారో అధికారులకే తెలియాలి ఒకటి రెండు షాపులు కాకుండా మొత్తం కాంపౌండ్ గోడ ఆక్రమించుకోవడంతో పంచాయతీ పన్ను రసీదు అడ్డం పెట్టుకొని విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసుకొని కోర్టుకు వెళ్దామని అధికారులనే బెదిరించడం కొసమెరుపు పంచాయతీకి ఆదాయం లేదని అధికారులు చెప్పడమే తప్ప ఆచరణ చేసి చూపిస్తే పంచాయతీ నిధులతో అధికారికంగా షెడ్లు ఏర్పాటు చేసి నెల బాడుగ మీద ఇవ్వచ్చనే అభిప్రాయం కూడా ఉంది .. కొంతమంది షాపు యజమానులు దాదాపు స్థలం నాదంటూ నాదంటూ సోమవారం నాడు కొట్టుకునే పరిస్థితి వచ్చింది పంచాయతీ అధికారులు మాత్రం అర్జీ రాసివ్వండి చూద్దాంలే అన్న పరిస్థితి రావడం దేనికి సంకేతం అని మామూలు అందుతున్నాయా అని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

About Author