PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ మద్యం బాటిల్స్​ ధ్వంసం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పత్రిక మరియు మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా, 07.11.2023 వ తేదీన సెబ్ అడిషనల్ ఎస్ పి శ్రీ జి.కృష్ణ కాంత్ పటేల్, ఐ.పీ ఎస్ వారి ఆధ్వర్యం లో కర్నూలు మరియు కోడుమురు సెబ్ స్టేషన్ లలో   మొత్తం 323 కేసులలో సీజు చేసిన అక్రమ మద్యం 21500 బాటిల్స్ లో కల  2303 లీటర్ల మద్యం మరియు నాటు సారా (2824 లీటర్లు) ను పంచాలింగాల రైల్వే బ్రిడ్జి దగ్గర లో కల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రోడ్ మీద ధ్వంసం చేయడము అయినది. ధ్వంసం చేయబడిన మద్యం విలువ సుమారు 10,00,000/- (పది లక్షల రూపాయలు) ఉంటుంది. తదుపరి ఏర్పాటు చే సి న ఇన్స్పెక్టర్ల  సమావేషము  లో జిల్లా సెబ్ అడిషనల్  ఎస్ పి. శ్రీ జి.కృష్ణ కాంత్ పటేల్, ఐ.పీ ఎస్ వారు మాటడుతూ జిల్లా సరిహద్దుల్లో ని చెక్ పోస్టులలో పనిచెస్తున్న సెబ్ సిబ్బంది రాబోవు నూతన సంవత్సర, పండుగలు మరియు సాధారణ ఎన్నికలను దృష్టి లో ఉంచుకుని అప్రమత్తంగా పనిచేయాలని, అక్రమ మధ్యాన్ని జిల్లా లోనికి రాకుండా అరికట్టాలని సూచనలను జారీ చేశారు. అలాగే అక్రమముగా  మద్యమును తీసుకుని వస్తున్న వారిని పట్టుకుని వారి  పై కేసులను నమోదు చేయాలని మరియు పాత నేరస్తులను బైండోవర్ చేయాలనీ సూచించారు. విధులలో నిర్లక్ష్యముగా వ్యవహరించిన సిబ్బంది పై కఠిన చర్యలను తీసుకుంటాము అని తెలిపారు.  ఈ సమావేశం లో ఏ.ఈ.ఎస్ ఇంచార్జ్ మరియు సెబ్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ సి.ఐ. శ్రీ. పి. రాజ శేఖర్ గౌడ్ , సెబ్ స్టేషన్ కర్నూలు సి.ఐ.  ఎం సత్యన్నారాయణ, సెబ్ స్టేషన్ కోడుమూరు  సి. ఐ.  బి శ్యాం ప్రసాద్, డీ టీ ఎఫ్ ఎస్ ఐ స్వామినాథన్ , సెబ్ స్టేషన్ ఎస్ ఐ లు టీ .ప్రసాద రావు, టీ. అన్వేష్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author