సీఎం కేసీఆర్ కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి ..!
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. హుటాహుటిన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఆయన కేసీఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. రెండు రోజులుగా ఆయన వీక్‌గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్తున్నారని డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.