భారత్ భరోసా పై ఐఎంఎఫ్ అభినందన
1 min readపల్లెవెలుగువెబ్ : సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు సహాయపడుతున్న భారత దేశాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రశంసించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీతో అమెరికాలో సమావేశమై, ఆ దేశానికి సహాయపడతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో నిర్మల సీతారామన్‌తో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా సమావేశమైనట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. శ్రీలంక పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉంటామని చెప్పినట్లు పేర్కొంది.