PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ప్రభుత్వ ఉధ్యోగులు మరియు ఉపాద్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బిల్లులను వెంటనే చెల్లించాలి​ – ఆప్టా

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులు, పెన్సనర్లకు అందించాల్సిన వివిద రకాలు ఆర్దిక బిల్లులు సి.ఎఫ్.యమ్.ఎస్ వద్ద నెలలు తరబడి చెల్లింపులు జరగక ఇబ్బంది పడురున్నారని, సత్వర చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు లు ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి లేఖ ద్వారా విన్నవించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా ఉద్యోగులు సంక్షేమ పధకాలు ప్రజల వద్దకు చేరేలా పని చేశారని గుర్తుచేశారు. మండల పరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికల్లో కూడ ఓటర్లు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకునేలా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహాకరించి ప్రభుత్వ మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఈ విధంగా ప్రభుత్వానికి సహకరించి, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఆర్ధిక అంశాలు నెలల తరబడి అపరిష్కృతంగా ఉండడం వల్ల మానసిక స్దైర్యం దెబ్బ తింటుందని వారు వాపోయారు. అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే సంపాదిత లీవ్​లు, పి.ఎఫ్ రుణాలు, మెడికల్ రీయుంబర్స్​మెంట్ బిల్లులులను ట్రెజరీ అధికారులు పాసు చేసి పంపి నెలలు గడుస్తున్నా.. సి.ఎం.ఎఫ్ యస్ నుండి బ్యాంక్‌కు నగదు జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా, ఇతర కారణాల వలన చనిపోయున ఉద్యోగుల డెత్​ క్లెయిమ్​లు, ఏపిజిఎల్ఐ లోన్లు, జడ్.పి.పి.ఎఫ్ లోన్ల సోమ్మును మంజూరు చేసి నెలలు గడిచినా సి .ఎఫ్ .ఎం.యస్ వద్ద పెండింగు ఉండుటం వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇందులో కొంతమంది కారోనా సోకి ఇబ్బంది పడినవారు ఉన్నారని ఆ సమయంలో వాడుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని గుర్తు చేశారు. పెన్షనర్లకు పెంచిన కరువు భత్యం బకాయులు వారి ఖాతాలో జమ కాలేదని వివరించారు. సి.పి.యస్. ఉద్యోగులకి జులై 2018 నుండి జనవరి 2019 కరువు భత్యం బకాయులలో 90శాతం నగదుకు సంభందించిన బిల్లులు సి.ఎఫ్.యం.ఎస్ కు పంపి 9నెలలు గడిచినా ఇంత వరకు బ్యాంక్​ఖాతాల్లో జమ కాలేదని చెప్పారు. కేవలం నెలవారి జితాలు, పెన్షన్లు తప్ప ఎలాంటి బిల్లులకు సంభందించిన నగదు ఉద్యోగులకు అందడం లేదని, అత్యవసరాల నిమిత్తం అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. కావున ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకొని సిఎఫ్ఎంఎస్ లో నిలబడిపోయిన ఉద్యోగులు మరియు ఉపాద్యాయుల బిల్లులు వెంటనే బ్యాంక్​లకు పంపేలా చర్యలు తీసకోవాలని కోరారు.

About Author