PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించాలి…

1 min read

బాధితులను కాపాడిన వారిని ప్రోత్సహిస్తూ ఐదు వేల రూపాయల  నగదు బహుమతి..

ఆపద్బాంధవుడిగా గుర్తించి ప్రభుత్వం సేవ పత్రం అందిస్తుంది..

మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కెవిఎస్  ప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం స్ధానిక సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఉప రవాణా కమీషనరు యస్. శాంతకుమారి ఆధ్వర్యంలో  రహదారి భద్రతా నియమాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్బంగా యంవిఐ కెవిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం 30 ఏళ్ళ లోపు వయసు వారే మరణిస్తున్నారని అన్నారు. దీనికి కారణం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం తదితర కారణాల వలన జరుగుతున్నాయన్నారు. మీపై మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారిని దృష్టిలో ఉంచుకుని వాహనాలను నడపాలని, అదేవిధముగా హెల్మెట్, సీట్ బెల్ట్ తదితర భద్రతా నియమాలు పాటిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చన్నారు.మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జి. నాగ మురళి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా 16 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు వారు మరణిస్తుండటం చాల బాధాకరమని అన్నారు. 18 ఏళ్ళ వయసు నిండిన వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు.కార్యక్రమములో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు జి.ప్రసాద్, కెవిఎస్. ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అజ్మీరా బద్దు, జి.స్వామి, రోడ్డు భద్రతా వైద్యురాలు మౌనిక, రోడ్డు భద్రతా వైద్యురాలు జి. మౌనిక, కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వర రావు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author