NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిమ‌జ్జనం.. ప్రశాంతంగా జరుపుకుందాం : టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్​:గ‌ణేష్ నిమ‌జ్జనం ప్రశాంత వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాల‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ ప్రజ‌ల‌ను కోరారు. బుధ‌వారం న‌గ‌రంలోని చిన్నమార్కెట్‌, మించిన్‌బ‌జార్‌, చ‌ల్లావారి వీధి, బంగారుపేట‌, ధ‌ర్మపేట‌, ప్రకాష్ న‌గ‌ర్లలోని వినాయ‌క మండ‌పాల వ‌ద్ద ఏర్పాటుచేసిన అన్న‌దాన కార్యక్రమాల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు అన్నం వ‌డ్డించారు. అనంత‌రం భ‌ర‌త్ మాట్లాడుతూ క‌ర్నూల్లో నిమ‌జ్జనం ప్రతియేటా వైభ‌వంగా జ‌రుగుతుంద‌న్నారు. ఈ సంవ‌త్సరం కూడా నిమ‌జ్జనం ప్రశాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగేందుకు ప్రజ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో వినాయ‌క మండ‌పాల నిర్వాహ‌కులు, భ‌క్తులు పాల్గొన్నారు.

About Author