భక్తి శ్రద్ధల నడుమ గణేష్ నిమజ్జనం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో బుధవారం గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది.ముందుగా వివిధ గ్రామాల్లో వినాయకుని ప్రసాదం లడ్డును వేలం పాటల్లో అత్యధికంగా పలికిన వారిలో ప్రసాదం లడ్డూను దక్కించుకున్నారు.మండలంలోని మిడుతూరు మండల కేంద్రంతో పాటు పైపాలెం, నాగలూటి,గుడిపాడు, సున్నంపల్లి,చింతలపల్లి, కాజీపేట,జలకనూరు, సుంకేసుల,బైరాపురం,చెరుకు చెర్ల,తిమ్మాపురం, అలగనూరు రోళ్లపాడు,తలముడిపి గ్రామాల్లో గణేష్ నిమజ్జనం చేశారు.గ్రామాల్లో ఉదయం నుంచే గ్రామ ప్రజలు మహిళలు పిల్లలు భక్తి శ్రద్ధ నడుమ పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలో వినాయకుడిని డ్రమ్స్ నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్తూ 32 ఒకరు రంగులు చల్లుకుంటూ పిల్లలు యువకులు డాన్సులు వేసుకుంటూ హంగామా చేశారు.చివరగా వినాయకుడిని ఆయా గ్రామాల సమీపంలో ఉన్న నీటిలో వినాయకుడిని కలిపారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగ కుండా ఏఎస్ఐ సుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గ్రామాలను పర్యవేక్షించారు.