NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా గణనాధుల నిమజ్జనం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు  :  వెలుగోడు పట్టణంలో గణనాథుడు నిమజ్జనం యువకుల జై బోలో గణేష్ మహరాజ్ కి నినాదాలతో అంగరంగ వైభవంగా జరిగింది. వెలుగోడు పట్టణంలో 40 కి పైగా ఆయాప్రాంతాలలోగణనాథులను ప్రతిష్టించారు.మూడురోజులపాటు  గణనాథులు భక్తుల నుండి పూజలను అందుకొని తదుపరి నిమజ్జనానికి తరలి వెళ్లాయి. మూడు రోజులపాటు గణేష్ మండపాల వద్ద ఆయా కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇది ఎలా ఉండగా వినాయకుల వద్ద ఉంచిన లడ్డూ వేలం పాటలు పోటిగా సాగాయి.  గంగా బావి వీధి వినాయకుడి వద్ద ఏర్పాటుచేసిన లడ్డు పెంట్లవల్లి బాలమ్మ కుమారులు నాగేశ్వరరావు, రవికుమార్ 54300 రూపాయలకు దక్కించుకోగా, గాంధీనగర్ వినాయకుడి వద్ద లడ్డు వేలంపాటలో శివ 25116 రూపాయలకు , అమ్మవారి శాలలో వినాయకుని లడ్డు 24 వేల రూపాయలకు పవన్ కుమార్ దక్కించుకున్నారు. ద్వారక నగర్  వినాయకుని వద్ద లడ్డు వేలం పాట 50 వేల రూపాయలు, చెంచు కాలనీలో లడ్డూ వేలం 52,000 రూపాయలు . సిపి నగర్ వినాయకుని వద్ద లడ్డూ వేలం పాటపాడిదక్కించుకున్నారు .పోలీసు శాఖ వారి ఆదేశాల అనుసారం విగ్రహాలను వరుస క్రమంలో నిమజ్జనానికి గాలేరు నీటి ప్రవాహం వద్దకు తీసుకొని వెళ్లి వినాయకుల నిమజ్జనం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వేల్పుల జైపాల్ వినాయకుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గ్రామం నుండి వినాయక ఘాట్ వరకు రోడ్లను శుభ్రపరిచి సున్నం మార్కులను వేయించారు. అదేవిధంగా వినాయక నిమజ్జనం ప్రాంతంలో బారికెట్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. నిమజ్జన సందర్భంగా ఏ లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ వారు బంధ దోస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని , ఆత్మకూర్ సిఐ వెలుగోడు ఎస్సై వెంకటప్రసాద్, మిడ్తూర్ ఎస్సై జగన్మోహన్, ఎంపీపీ లాలం రమేష్, సర్పంచ్ వేల్ప జైపాల్ పర్యవేక్షించారు.

About Author