NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా గణనాధుల నిమజ్జనం..

1 min read

– కొండపేట లో గణనాథుని లడ్డు భారీ వేలం పాట

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని కొండపేట లో గణనాథుడు నిమజ్జనం యువకుల జై బోలో గణేష్ మహరాజ్ కి నినాదాలతో అంగరంగ వైభవంగా జరిగింది, చెన్నూరు టౌన్ తో పాటు ఇతర ప్రాంతాలలోగణనాథులను ప్రతిష్టించి,మూడురోజులపాటు భక్తుల నుండి పూజలను అందుకొని తదుపరి నిమజ్జనానికి తరలి వెళ్లాయి,  గణేష్ మండపాల వద్ద ఆయా కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, కొండపేట లోని పీర్ల చావిడి వద్ద గల గణనాథుని లడ్డు వేలం పాటలో అదే గ్రామానికి చెందిన గుడిపాటి నాగేంద్ర ఒక లక్ష 30 వేల రూపాయలకు దక్కించుకోవడం జరిగింది , కాగా గణనాధునికి శనివారం ఉదయం 8గంటలకు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు, మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి గ్రామోత్సవము నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయడం జరిగింది, అలాగే వినాయకుల వద్ద ఉంచిన లడ్డూ వేలం పాటలు పోటిగా సాగాయి,పోలీసు శాఖ వారి ఆదేశాల అనుసారం విగ్రహాలను వరుస క్రమంలో నిమజ్జనానికి చెన్నూరు పెన్నా నది నీటి ప్రవాహం వద్దకు తీసుకొని వెళ్లి వినాయకుల నిమజ్జనం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author