మరణం లేని మహనీయుడు డా.బీఆర్ అంబేద్కర్
1 min read
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మరణం లేని మహనీయులు డా.బీఆర్ అంబెడ్కర్ అని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు ప్రేమరాజు అన్నారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నందికొట్కూరు పట్టణ నందు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ రాజు, మాదిగ విజ్జి మాదిగ మాట్లాడుతూ మరణం లేని మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడికి ఉందని మరణించిన రాజ్యాంగ రూపంలో సూర్యచంద్రులు ఉన్నంతవరకు చిరస్మరణీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల నాయకులు.బందెల వెంకటేశ్వర్లు, భాష పోగు రాజేష్, బొల్లెద్దుల ఏసన్న , విద్యానగర్ , కే.సురేష్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.