NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమర వీరులను  స్మరించుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:   దేశం కోసం పోరాడిన అమరవీరులను స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను  ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎంపీడీఓ శోభారాణి అన్నారు. నందికొట్కూరు మండల పరిధిలోని బొల్లవరం, దామగట్ల గ్రామాలలో గురువారం ఎంపీడీవో శోభ రాణి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో నా భూమి, నా దేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నా భూమి, నా దేశం శిలాఫలకాన్ని ఏర్పాటుచేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఎంపీడీవో  , ఏపీఓ అలివేలు మంగమ్మ తమ సిబ్బందితో మరియు విద్యార్థిని, విద్యార్థులతో మొక్కలు నాటించి వాటి అవకశతను గురించి విద్యార్థులకు వివరించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది ఈసీ షబానా, గ్రామ సర్పంచులు, మాధవరం సుశీలమ్మ, రాఘవరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ కవిత, ఆయా స్కూల్ల హెచ్ఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author