‘ఆరోగ్యశ్రీ’ అమలు.. పటిష్టం చేయండి..
1 min readఅడిషనల్ డీఎంఈ, సూపరింటెండెంట్ డా. నరేంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్:రాయలసీమ నుంచే కాక… తెలంగాణ నుంచి వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగరాదని, మెరుగైన వైద్య పరీక్షలు చేసి పంపాలని సూచించారు అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి. సోమవారం వైద్యశాల ధన్వంతరి హాల్లో వైద్య అధ్యాపకులతో ఆరోగ్యశ్రీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న అన్ని వైద్య అధ్యాపకులతో సమీక్ష నిర్వహించి అనంతరం ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ (Arogya Sree) అమలును మరింత పటిష్టం చేయాలని అధ్యాపకులకు సూచించారు. ఆస్పత్రిలో పేషంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొన్ని విభాగాలు డిస్మాండింగ్లో వెళ్లిపోతున్న సందర్భంగా వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసే విధంగా వైద్య అధ్యాపకుల పలు సూచనలు తీసుకున్నారు.
డా. నరేంద్రనాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి బర్త్డే సందర్భంగా వైద్యధ్యాపకులు మరియు ఆసుపత్రి సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ CSRMO, డా.హేమనలిని, మరియు వైద్య అధ్యాపకులు, డా. శ్రీరాములు, డా. విద్యాసాగర్, డా.శ్రీహరి, డా.ప్రకాష్, డా.శ్రీలక్ష్మి, నోడల్ ఆఫీసర్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబల నగంజన్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.