పాత పెన్షన్ అమలు.. ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: 3 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చి పదవీ విరమణ చేసిన తర్వాత వారికి భరోసా కల్పించే పాతపెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,జిల్లా నాయకులు అబ్దుల్ లతీఫ్ కోరారు.యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగుల పెన్షన్ విధానం గురించి ఆయా రాజకీయ పార్టీల వైఖరి తెలియచేసి వారి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడమే గాక ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానం మాత్రమే పునరుద్ధరించాలని కోరుతూ ప్యాపిలి మండలంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వ్యవసాయ మండలి చైర్మన్ మెట్టుపల్లి వెంకటేశ్వర రెడ్డి,మండల వైస్ సర్పంచ్ గడ్డం భువనేశ్వర రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఉమా మహేశ్వర రెడ్డి,చిన్న రామాంజనేయులు,బోరెడ్డి రాము,పోదొడ్డి కృష్ణమూర్తి,శ్రీనివాస రెడ్డి లకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉంటూ ప్రజాసంకల్ప యాత్ర చేసే సమయంలో పాత పెన్షన్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వారంలోనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని అయితే 5 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ హామీ,హామీ గానే మిగిలి పోయిందని కావున ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేసి ఉద్యోగ,ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు నెల్లూరప్ప,శాంతి కుమార్,రాజేంద్ర,మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.