పథకాల అమలులో తండ్రిని మించిన సీఎం వైఎస్ జగన్ : ఎమ్మెల్యే
1 min readమహిళలు సంక్షేమానికే పెద్ద పీట : ఎమ్మిగనూరు సమన్వయకర్త : శ్రీమతి బుట్టా రేణుక
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలలో జరిగిన నవరత్నాలు అమలులో భాగంగా – 4వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. గోనెగండ్ల మండలంలోని గ్రూపులకు మంజూరైన రూ. 3.48 కోట్ల మెగా చెక్కును పొదుపు మహిళలకు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక , అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” మట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. మహిళా ఆర్ధిక సాధికారత సాధించినప్పుడే కుటుంబ అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి గా చేసుకోవడానికి కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదుగుదలతోనే కుటుంబ కూడా అన్ని రంగాల్లో ముందుకు పోతుంది అన్నది మన సీఎం జగనన్న సంకల్పం అన్నారు. అక్కడ కూడా గత తెలుగుదేశం పాలనలాగా లంచాలకు తావివ్వకుండా నేరుగా మహిళల ఖాతాల్లోకి సంక్షేమం చేరుతుందన్నారు.ఇలాంటి పాలన మనకు చాలా అవసరం కావున రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శ్రీమతి బుట్టా రేణుక పోటీ చేస్తుందని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.శ్రీమతి “బుట్టా రేణుక” మాట్లాడుతూ మహిళలు మహారాణులు కావాలనేదే సీఎం జగనన్న లక్ష్యమన్నారు. అక్కాచెల్లమ్యల కోసం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చరన్నారు.అనంతరం సేవా పురస్కారాలు అందుకున్న వలంటీర్లతో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి , సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక , వారు మాట్లాడుతూ వలంటీర్లు అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ఫలాలను పేదలందరికి చేరుస్తున్నారన్నారు. పల్లెల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హైల్త్ క్లీనిక్లు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన సేవాలు అందించడం సంతోషకరమన్నారు. వాలంటీయర్ల వ్యవస్థతో పారదర్శకంగా పథకాలు చేరిక. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న జగనన్నను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు.ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠప్ప , ఎంపీపీ నసురుద్దీన్ , వైస్ ఎంపీపీ, గోనెగండ్ల మండల యూత్ ప్రెసిడెంట్, కన్వీనర్, జడ్పీటీసీ, కో ఆప్షన్ మెంబెర్, జెడ్పీటీసీ, మండల జేసియస్ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు గోనెగండ్ల మండల అధికారులు తహశీల్దార్, ఎంపీడీఓ, డియర్ డిఓ పీడీ, డియర్ డిఓ, ఎపిఎం, వలెంటెర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.