PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయచోటి పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక

1 min read

– వెలిగల్లు నీటి సరఫరా పై సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలి

– రాయచోటి మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: వెలిగిళ్ళు నీటి సరఫరా లో ఎలాంటి అంతరాయం లేదు ప్రతీ పట్టణానికి తగినంత మొతాదులో నీటి సరఫరా జరుగుతున్నదని రాయచోటి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు.ఈ నెల 8 వ తేదీన వీచిన ఈదురు గాలులు,ఉరుములు,మెరుపుల కారణంగా వెలిగిళ్ళు ప్రాజెక్టు వద్ద ఇంటెక్ వెల్ మోటార్ల కు విద్యుత్ సరఫరా జరిగే  ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయిన విషయం విధితమే.అయితే పట్టణ ప్రజా నీటి అవసరాల దృష్ట్యా గౌరవ MLA &ప్రభుత్వ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ప్రత్యేక ద్రుష్టి సారించి,APSPDCL అధికారుల&మున్సిపల్ అధికారుల సమన్వయముతో మరమ్మతులకు దాదాపు నెల సమయం పడుతుండడం తో ప్రయివేట్ ఎలక్ట్రీకల్ సంస్థల తో మాట్లాడి  ప్రత్యామ్నయంగా ట్రాన్స్ ఫార్మార్ ఏర్పాట్లుచేయించామన్నారు.అదేవిధంగా  యుద్ధప్రాతిపదికన 48 గంటల్లో  నీటి సరఫరా ను పునరుద్దణ చేయించడం జరిగిందన్నారు ఈ నెల 10వ తేదీ నుండి నీటి పట్టణానికి సరఫరా జరుగుతున్నదన్నారు. మరమ్మత్తుల సమయం లో (2 రోజులు )జరిగిన అంతరాయం వలన వివిధ వీధుల్లో నీటి సరఫరా లో ఒకటి రెండు రోజులు రావాలసిన సమయం కన్న ఆలస్యం అవుతున్నది తప్ప నీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బంది లేదు.దయచేసి ప్రజలకు గమనించి,సహకరించగలని కోరుతున్నాము.మరీ ఎక్కువ రోజులు నీటి సరఫరా జరగని ఏరియాలు ఉండిన వెంటనే సచివాలయ సిబ్బంది దృష్టికి గానీ,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి గానీ తీసుకొని వచ్చిన పరిశీలించి, పరిష్కరిస్తామనివిజ్ఞప్తి చేయడమైనది ఈ విషయాన్ని  ప్రజలు  గమనించి సహకరించాలని కోరారు.

About Author