PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని ఆలయ దక్షిణ మాడవీధిలో నిత్య కళారాధన వద్ద సంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.   దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు తాండవకృష్ణ నృత్యాలయ, మహబూబాబాద్, తెలంగాణా వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.8:00 ని||ల నుండి సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమములో వినాయక కౌత్వం, శివతాండవస్తోత్రం, నమ: శివాయితే, భో శంభో శివశంభో, అయిగిరి నందిని తదితర గీతాలకు ఉపాసన, శ్రీతన్వి, మనస్ని, మాళవిక, గోమతి, సహస్ర, దీపు, తేజ, మేఘన, కార్తిక్, అక్షయశ్రీ, సునయన, ప్రవర్షిని, రిషితాలహరి, దీక్షిత, అనూష, సాన్విక, దుర్గాహసిని, లాస్య, ప్రియ, హన్విక, తదితరులు నృత్య ప్రదర్శన చేయనున్నారు. కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్యం, సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

About Author