దిన్నెదేవరపాడు సంక్షేమ బాలుర వసతి గృహం తనిఖీ చేసిన జేసీ
1 min readపల్లెవెలుగు కర్నూలు : కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడు గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని బుధవారం సంయుక్త కలెక్టరు (ఆసరా & సంక్షేమము)యం.కె.వి.శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ గృహంలోని వసతులు, మెస్ తదితర వివరాలను బాలురను అడిగి తెలుసుకున్నారు.
వసతి గృహంలో దోమల బెడద ఎక్కువగా ఉందని విద్యార్థులు జేసీ దృష్టికి తీసుకురాగా.. కిటికీ లకు “మెష్” వేయించాలని వసతి గృహం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వసతులు మెరుగు పరచాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి ఎస్. మహబూబ్బాషను జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశించారు.