బోధన అభ్యసన సామాగ్రి తోనే విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/9-7.jpg?fit=550%2C309&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎఫ్ ఎల్ ఎన్ ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం శ్రీ రాఘవేంద్ర B.Ed. కళాశాల నందు జరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన మెరుగవ్వాలంటే కచ్చితంగా బోధన అభ్యసన సామాగ్రిని వినియోగించాలని అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవడానికి రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాల పై సానుకూల ధోరణి కలిగి ఉండాలని ఆరు రోజుల FLN శిక్షణా కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులను ఉద్దేశించి గౌరవ కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి వివరించడం జరిగింది . ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా TLM మేళాను సందర్శించి, ఉపాధ్యాయులు తయారుచేసిన TLM ను అభినందించారు . ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ శిక్షణ లో నేర్చుకున్న అంశాలను పాఠశాల ల్లో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదన్నారు lమండల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు భాష గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వెల్లడించారు ఈ టిఎల్ఎం మేళ లో ప్రదర్శించిన నమూనాలు విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నాయని ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది ఈ శిక్షణలో ఉపాధ్యాయులు విద్యార్థులయి ఆసక్తిగా పాల్గొన్నారు ఈ శిక్షణ పాఠశాల స్థాయిలో ఆములుపరిచే బాధ్యత ఉపాధ్యాయులు అక్కడ మీకు మంత్రిగారి డాక్టర్ రఫీ అన్నారు, ఈ కార్యక్రమంలో ప్రథమ్ జిల్లా కోఆర్డినేటర్ దావీదు, కేఆర్పీలు, డిఆర్పీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/91-2.jpg?resize=550%2C309&ssl=1)