నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఎంచుకున్న క్రీడలో రాణించాలి
1 min read– యువ పరిశ్రమికవేత్త కర్నూల్ టిడిపి అసెంబ్లీ ఇన్చార్జి భరత్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీడాకారులు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకొని తాముంచుకున్న హ్యాండ్ బాల్ క్రీడలో రాణించాలని యువ పరిశ్రమికవేత్త కర్నూల్ టిడిపి అసెంబ్లీ ఇన్చార్జి భరత్ అన్నారు. సోమవారం హ్యాండ్ బాల్ కర్నూల్ డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని అవుట్డోర్ స్టేడియం నందు 46వ జాతీయస్థాయి జూనియర్ బాలుర నేషనల్ హ్యాండ్ బాల్ శిక్షణ శిబిరాన్ని పారిశ్రామికవేత్త టీజీ భరత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో అంకితభావంతో సాధన చేస్తే తమ అనుకున్న లక్ష్యాలను అధిరోహించవచ్చని అన్నారు. క్రీడాకారుల సంక్షేమం కోసం టీజీవి సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు.ప్రభుత్వాలు క్రీడాకారుల సంక్షేమం కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. అనంతరం సిటీ కేబుల్ మేనేజర్ మహేష్ శెట్టి, హ్యాండ్బల్ కర్నూల్ డిస్టిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రుద్ర రెడ్డి మాట్లాడుతూ జనవరిలో రాజస్థాన్లో జరగబోయే 46 వ జాతీయస్థాయి జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ జట్టు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ శిక్షకులు కీర్తి వెంకటేష్,ప్రభాకర్, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి మంచికంటి అవినాష్ శెట్టి, జిల్లా ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం చిన్న సుంకన్న సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.