2024 లో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి
1 min read– వైసీపీ పార్టీ మండల కన్వీనర్ రవియాదవ్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో భాగంగా పల్లెకు పోదాం కార్యక్రమం నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో నందికొట్కూరు వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు రవి యాదవ్, మండల జేసిఎస్ కన్వీనర్ ఓంకార్ రెడ్డి. ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ ప్రజలందరి అవసరాలు తెలుసుకుని వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారికి అందిస్తున్నారన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా తీరుస్తు న్నారన్నారు. అందుకే ఇలాంటి పాలన ప్రజలు మళ్లీ పొందాలంటే కచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు.ఎందు కంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రోజున మన కుటుంబంలో ఒక ఇంటి పెద్దగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక అన్నగా, ఒకతమ్ముడిగా, పిల్లలకు ఒక మేనమామగా ఈ రోజున మన అందరి కుటుంబాలలో కూడా ఇమిడి పోయారని తెలిపారు.మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వాదించాలని అన్నారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ,నందికొట్కూరు ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి, జడ్పీటీసీ కలిమున్నిసా ,నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహాత్ జబ్బార్ ,ఎంపీడీఓ శోభారాణి, ఇఓఆర్డీ సంజన్న ,బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు సతీష్ రెడ్డి ,నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మి కాంతరెడ్డి , వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి,అల్లంపూర్ రవీంద్ర నాయుడు, రామలింగం నాయుడు, వెంకటస్వామి, పాపన్న, గ్రామ పెద్ద నడిపి మద్దిలేటి, సుధాకర్ రెడ్డి, నందికొట్కూరు ఎంపీటీసీలు , సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు , అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు,మండల కమిటీ సభ్యులు,గృహ సారథులు, వాలంటీర్స్,గ్రామ ప్రజలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.