PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

61 రోజుల్లో.. రూ.60 లక్షలు

1 min read

– శ్రీశైలమల్లన్న హుండీ ఆదాయం లెక్కింపు
పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో 61 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.60,19,628 నగదుతోపాటు 82 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి, 365 ఇంగ్లాండు ఫౌండ్స్​, 50 యూఏఈ దిర్హమ్స్​, 5 యూరోప్​, 1 ఎస్​ఏఏ డాలర్ తదితర విదేశీ కరెన్సీ​ హుండీ లెక్కింపులో లభించినట్లు ఆలయ ఈఓ కేఎస్​ రామారావు తెలిపారు.


About Author