PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుమ్ము రేగే కాంబోలో..

1 min read

సినిమా డెస్క్​ : కోలీవుడ్‌ స్టార్‌‌ హీరో విశాల్‌కు టాలీవుడ్‌లో కూడా మాంచి ఫాలోయింగ్‌ ఉంది. అటు మాస్‌ ఇటు క్లాస్‌ను మెప్పించే హీరో విశాల్. తను కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎన్నో మాస్ యాక్షన్ చిత్రాల్లో నటించారు. తర్వాత రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా సినిమాలు చేస్తూ వచ్చారు. ‘అభిమన్యుడు’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు. ఇక బోయపాటి శ్రీను ఊర మాస్ కంటెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రతి సినిమా హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఎగ్జయిట్ చేస్తారు. మరి అలాంటి కాంబినేషన్ చేతులు కలిపితే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సినవసరం లేదు. విశాల్ మాస్ ఇమేజ్‌కు తగ్గ ఓ భారీ యాక్షన్ స్క్రిప్ట్‌ని సిద్దం చేయించినట్లు సమాచారం. రచయిత ఎం రత్నం ఈ సినిమాకు కథ- మాటలు అందిస్తున్నారుట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు ముందుకొచ్చినట్లు తెలిసింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం బోయపాటి బాలయ్య బాబుతో ‘అఖండ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే విశాల్ కూడా కోలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. బోయపాటి- విశాల్ సినిమా నిజమైతే విశాల్‌కు ఫస్ట్‌ తెలుగు సినిమా ఇదే అవుతుంది.

About Author