ప్రభుత్వ వైద్యశాలలో..గుండె పోటుకు చికిత్స
1 min readనందికొట్కూరు వైద్యులు రాంబాబు,రాజ శేఖర్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలోబుధవారం ఛాతీ నొప్పి, ఆయాసం,స్పృహ కోల్పోవడం గుండె దడ వంటి లక్షణాలతో వచ్చిన రోగులకు ఈసీజీ ద్వారా గుండె పోటును గుర్తించి అత్యవసరమైన ఇంజెక్షన్ టెనెక్టిప్లేస్ ను ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుతుందని 40 వేల రూ.ల విలువ గల ఇంజెక్షన్ టెనెక్టిప్లేస్ ను ప్రభుత్వం ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంబాబు మరియు జనరల్ ఫిజీషియన్ డా.రాజశేఖర్ పాత్రికేయులతో అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతవరకు 21 మంది గుండె పోటు రోగులకు ఇంజెక్షన్ టెనెక్టిప్లేస్ ను ఇచ్చి వారి ప్రాణాలను కాపాడం జరిగిందన్నారు.ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత రోగులను కార్డియాలజీ విభాగం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంజియో గ్రామ్ మరియు మరిన్ని పరీక్షల నిమిత్తం ఆంబ్యులెన్స్ ద్వారా పంపడం జరిగింది. కావునా ఈ ప్రాంత ప్రజలకు ఎవరికైనా పై లక్షణాలు కనిపించినట్లయితే నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని వారు ప్రజలను కోరారు.మంగళవారం అనగా 04.02.2025 నాడు హుశేన్ భీ(55) మహిళ ఛాతీ నొప్పి మరియు ఆయాసం తోటి ఆసుపత్రికి మధ్యాహ్నం 12.20 గంటలకు రావడం జరిగింది.ఆమెకు గుండెపోటు ఉందని గుర్తించి ఇంజెక్షన్ టెనెక్టిప్లేస్ ను మధ్యాహ్నం 12.40 గంటలకు ఇవ్వడం జరిగినదని తర్వాత ఆమెను కార్డియాలజీ విభాగం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డి యాలజీకి పంపించామని డాక్టర్ రాంబాబు అన్నారు.