ఒకే మహిళ శరీరంలో.. 32 రకాలుగా మారిన కరోన వైరస్.!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ దడపుట్టిస్తోంది. కొత్త కొత్త మ్యుటేషన్స్ తో ప్రజలకు గుబులు పుట్టిస్తోంది. దేశానికి ఒక రకంగా రూపాంతరం చెందుతూ వేలాది ప్రాణాలు బలిగొంటోంది. దక్షిణాఫ్రికా చెందిన ఓ మహిళ శరీరంలో కరోన వైరస్ 32 రకాలుగా మ్యుటేషన్ చెందడాన్ని పరిశోధకులు గుర్తించారు. 36 ఏళ్ల మహిళ హెచ్ఐవీతో బాధడుతుండగా… 216 రోజుల నుంచి కరోన వైరస్ తో పోరాడుతోంది. గత ఏడాది సెప్టంబర్ లో ఆమె కరోన బారినపడ్డారు. అప్పటి నుంచి ఆమె శరీరంలో కరోన వైరస్ స్పైక్ ప్రోటీన్ 13 రకాలుగా.. జన్యుపరంగా 19 రకాలుగా మార్పు చెందింది.