ఒక్క మాటతో.. 25 లక్షల కోట్లు కర్పూరంలా కరిగిపోయాయి !
1 min readపల్లెవెలుగు వెబ్: జాక్ మా. చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు. సాధారణ టీచర్ గా జీవితాన్ని మొదలుపెట్టి లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఒక్క మాటతో చిక్కుల్లో చిక్కుకున్నాడు. లక్షల కోట్ల సంపదను కోల్పోయాడు. చైనా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడమే జాక్ మా పాలిట శాపంగా మారింది. 2020 అక్టోబర్ 24న చైనాలో ది బండ్ సమిట్
పేరుతో సదస్సు జరిగింది. ఈ సదస్సులో జాక్ మా చైనా ఆర్థిక వ్యవస్థ లోపాలను ఎత్తిచూపారు. చైనా బ్యాంకులు తాకట్టు మనస్తత్వాన్ని వీడి విస్త్రతంగా ఆలోచించాలని సలహా ఇచ్చాడు. దీంతో కన్నెర్ర చేసిన చైనా ప్రభుత్వం.. జాక్ మా సంస్థల పై నిఘా పెట్టింది. జాక్ మాకు చెందిన యాంట్ కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అవ్వకుండా చేసింది. దీంతో ఆలీబాబా.. దాని అనుభంద కంపెనీలు షేర్ల ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో జాక్ మా 25 లక్షల కోట్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది.