ఆదోనిలో.. ఒకే ఇంట్లో ముగ్గురికి కరోన !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఆదోనిలో కరోన కలకలం రేపింది. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో వారికి జ్వరం రావడంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా తేలినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నిర్ధారణకు వారి నమూనాలను పరీక్షలకు పంపారు. అయితే..రెండు రోజుల క్రితం సదరు ఇంటికి అమెరికా నుంచి ఓ మహిళ వచ్చింది. ఫంక్షన్ ముగించుకుని ఆమె అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం బాధితులను గృహనిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.