PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనిలో..ఫ్యాన్​

1 min read
25వ వార్డు కౌన్సిలర్​ సిద్ధ కృష్ణవేణికి స్వీట్ తినిపిస్తున్న భర్త మల్లికార్జున

25వ వార్డు కౌన్సిలర్​ సిద్ధ కృష్ణవేణికి స్వీట్ తినిపిస్తున్న భర్త మల్లికార్జున

పల్లెవెలుగు, ఆదోని
మున్సిపల్​ ఎన్నికలో ఫ్యాన్​ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తోంది. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్​తోపాటు ఏడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ కలిపి మొత్తం 302 వార్డులు ఉన్నాయి. అందులో 77 ఏకగ్రీవం కాగా..225 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మున్సిపల్​ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించిన జిల్లా యంత్రాంగం… మధ్యాహ్నం 1 గంటలలోపు అన్ని మున్సిపాలటీల ఎన్నికల ఫలితాల లెక్కింపును పూర్తి చేశారు. కర్నూలు, ఆదోని, డోన్​, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, గూడురు నగర పంచాయతీలో వైసీపీ జెండా ఎగరేసింది.
ఫ్యాన్​ హవా..
ఆదోని మున్సిపల్​ పరిధిలో మొత్తం 42 వార్డులు ఉండగా అందులో 9 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 33 వార్డులకు ఎన్నికలు జరగగా.. 31 వైసీపీ విజయఢంకా మోగించగా… ఒకటి రెబల్​, ఒకటి మాత్రమే టీడీపీ సొంతం చేసుకుంది.
విజయోత్సవ సంబరాలు
ఆదోనిలో 40 వార్డులు వైసీపీ విజయకేతనం ఎగర వేయగా.. మరొకటి రెబల్​ అభ్యర్థి విజయం సాధించారు. ఆదోని మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరనుండటంతో.. వైసీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
25వ వార్డు కౌన్సిలర్​ సిద్ధ కృష్ణవేణికి స్వీట్ తినిపిస్తున్న భర్త మల్లికార్జున

About Author