అహోబిళంలో.. శ్రీ కొక్కే సుబ్రహ్మణ్యం స్వామి మఠం
1 min read– పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామిజీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ కొక్కే సుబ్రహ్మణ్యం స్వామి మఠం శాఖను ఒక ఎకరం స్థలం లో ఏర్పాటు చేస్తున్నట్లు పీఠధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ తెలిపారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అహోబిలం లో ఏర్పాటు చేయబోయే మఠం శాఖలో క్షేత్రం సందర్శనకు వచ్చు భక్తులు, యాత్రికులకు భోజనం, వసతి కోసం 25 ఏసీ, నాన్ ఏసీ గదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మఠం ఏర్పాటుకు ఈ నెల 20న శంకు స్థాపన చేస్తామని స్పష్టం చేశారు. ఈ ధార్మిక కార్యక్రమం నకు అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల సహాయ సహకారులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం కార్యదర్శి dr N వేణుగోపాల్, బ్రాహ్మణ సంఘం నాయకులు చంద్రశేఖర kalkura, హెచ్ కె మనోహర రావు, కల్లే చంద్రశేఖర్ శర్మ, హెచ్ కె రాజశేఖర రావు, మఠం ప్రతినిధి వరుణ్ గారు పాల్గొన్నారు.