NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ అమెజాన్​’లో.. త్వరలో 55వేల ఉద్యోగాలు

1 min read

– వెల్లడించిన సంస్థ చీఫ్​ ఆండీ జాసి రాయిటర్స్​
ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఈ-కామ‌ర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నిరుద్యోగుల‌కు తీపికబురు అందించింది. రాబోయే నెల‌ల్లో ప్రపంచ‌వ్యాప్తంగా 55,000 మందిని నియ‌మించుకోనున్నట్టు సంస్థ ప్రక‌టించింది. ఈ విష‌యాన్ని సంస్థ చీఫ్ ఆండీ జాసి రాయిట‌ర్స్ వెల్లడించారు. సంస్థ ఇత‌ర అవ‌స‌రాల‌తో పాటు రిటైల్, క్లౌడ్ డిమాండ్ ను కొన‌సాగించ‌డానికి సంస్థకు మరింత‌మంది అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు. ప్రాజెక్ట్ కైప‌ర్ అని పిలిచే బ్రాడ్ బ్యాండ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు విస్త్రతం చేయ‌డానికి, ఉప‌గ్రహాల‌ను కక్ష్యలోకి ప్రవేశ‌పెట్టడానికి సంస్థకు చాలా మంది ఉద్యోగులు అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అమెజాన్ జాబ్ ఫెయిర్ సెప్టంబ‌ర్ 15 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. తాము తీసుకున్న కెరీర్ డే అనే ఆలోచ‌న చాలా మందికి ఉప‌యోగ‌పడుతుంద‌ని జాసీ తెలిపారు.

About Author