PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అమీలియో’లో… అరుదైన కంటి శస్ర్తచికిత్స

1 min read

కార్నియా(నల్లగుడ్డు), శుక్లము మార్పిడి

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగరంలోని అమీలియో హాస్పిటల్​లో వైద్యులు అరుదైన శస్ర్తచికిత్స చేసి..  రికార్డు సాధించారు.  డా.వైఎస్సార్​ ఆరోగ్య శ్రీ పథకం కింద ఆస్పత్రిలో  కార్నియా స్పెషలిస్ట్​ డా. ఎస్​. మునీరాబేగం ‘ కార్నియా(నల్లగుడ్డు) మరియు శుక్లమును ఒకే శస్త్రచికిత్స ద్వారా మార్పు చేశారు. రోగికి కంటి చూపు ప్రసాదించారు. శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా, సి.బెళగల్​ మండలం , మారందొడ్డి గ్రామానికి చెందిన కె. దస్తగిరి 20 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు కుడికంటికి దెబ్బ తగిలి.. చూపు క్షీణిస్తూ వచ్చింది. ఆరు నెలల క్రితం అదే కుడి కంటికి పేడ పురుగు తగలడంతో ఇన్​ఫెక్షన్​ సోకి, నల్లగుడ్డు ( కార్నియా ) తెల్లమచ్చలా ఏర్పడి పూర్తిగా చూపు కోల్పోయాడు.  వారం రోజుల క్రితం చికిత్స కోసం అమీలియా ఆస్పత్రికి వచ్చారు. రోగికి వైద్యపరీక్షలు చేసిన డా. మునీరాబేగం …. శస్త్రచికిత్స చేయాలని నిర్ధారించింది. డా. వైఎస్​ ఆర్​ ఆరోగ్య శ్రీ పథకం కింద డా. ఎల్​.వి. ప్రసాద్​ ‘ఐ’ ఇన్​స్టిట్యూట్​ హైదరాబాద్​ వారి కార్నియా బ్యాంకు నుంచి నల్లగుడ్డు తెప్పించి… ఈ నెల 13న నల్లగుడ్డు మార్పిడితోపాటు శుక్లము ఆపరేషన్​ చేశారు. రోగికి కంటి చూపు ప్రసాదించారు. ఈ సందర్భంగా అమీలియో ఆస్పత్రి ఎండి. డా. చాపె ప్రసాద్​ మాట్లాడుతూ డా. వైఎస్సార్​ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మరిన్ని ఉన్నతమైన కంటి వైద్యసేవలు  అందించడానికి సిద్ధంగా ఉన్నామని, అంతేకాక కాటరాక్ట్​ మరియు అన్ని రకాల కార్నియా సమస్యలకు నిపుణులైన వైద్యులు ఆస్పత్రిల్లో అందుబాటులో ఉన్నారని తెలిపారు.  కార్నియా సమస్యలు ఉన్నవారు  ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అమీలియో హాస్పిటల్​లో డా.వైఎస్సార్​ ఆరోగ్య శ్రీ కింద మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు  ఆస్పత్రి ఎండి. డా. చాపె ప్రసాద్​. అనంతరం రోగి దస్తగిరి మాట్లాడుతూ  కంటి చూపు కోల్పోయిన తనకు రెండు శస్ర్తచికిత్సలు నిర్వహించి కంటి చూపును ప్రసాదించిన డా. మునీరాబేగం, అమీలియో ఆస్పత్రి ఎండి. డా. ప్రసాద్​ కు కృతజ్ఞతలు తెలియజేశారు. 

About Author