PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అమీలియో’లో.. అరుదైన శస్ర్త చికిత్స

1 min read

మహిళకు ఉన్న రెండు గర్భసంచులలో.. ఒకటి తొలగింపు

  • మరో గర్భసంచితో..మహిళ సేఫ్​..
  • అమీలియో ఆస్పత్రి గైనకాలజిస్ట్​ డా. కావ్య కంచర్ల

పల్లెవెలుగు: ఐదు నెలల గర్భిణీ… రెండు గర్భ సంచులలో ఒకటి పెరుగుదల ఆగిపోవడంతో స్పృహ కోల్పోయింది. అత్యవసర చికిత్స నిమిత్తం కర్నూలులోని అమీలియో ఆస్పత్రిలో చేరగా… గైనకాలజిస్ట్​ డా. కావ్య కంచర్ల అత్యద్బుత శస్ర్తచికిత్స చేసి… ఒక గర్భసంచిని తొలగించారు. మరో గర్భ సంచితో మహిళ క్షేమంగా ఉన్నారు.  బుధవారం కర్నూలు నగరంలోని అమీలియో ఆస్పత్రిలో ఆస్పత్రి ఎండి లక్ష్మీ ప్రసాద్​ చాపె, గైనకాలజిస్ట్​ డా.కావ్య కంచర్ల వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోణకు చెందిన 23 ఏళ్ళ చిన్న రంగమ్మకు ఒకటిన్నర సంవత్సరం క్రితం మొదటి కాన్పు సహజంగానే జరిగింది. రెండోసారి గర్భం దాల్చిన చిన్న రంగమ్మను భర్త వెంకటేశులు, బంధువులు చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్​సీ, ఆదోని ఏరియా ఆస్పత్రి, గుంతకల్లులోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. అప్పటికే  బీపీ , బ్లడ్​ శాతం పడిపోగా… తీవ్ర కడుపు నొప్పితో స్పృహ కోల్పోయిన చిన్న రంగమ్మను అత్యవసర చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.  ఈ నెల 10న ( శుక్రవారం) స్పృహ కోల్పోయిన చిన్న రంగమ్మను భర్త వెంకటేష్​ చికిత్స నిమిత్తం అమీలియో ఆస్పత్రికి తీసుకొచ్చారు. 

  • ఆధునిక పరికరాలతో… వైద్యం..
  • ఐదు నెలల గర్భిణీ చిన్నరంగమ్మకు అత్యవసర చికిత్స చేసిన అనంతరం.. స్కానింగ్​ చేయగా… రెండు గర్భసంచులు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అందులో ఒక  గర్భసంచి పెరుగుదల ఆగిపోవడం… బ్లడ్​ సరఫరా నిలిచిపోవడంతో ప్రమాదంగా మారింది. గైనకాలజిస్ట్​ డా. కావ్య కంచర్ల, అనస్థియా వైద్య బృందం శిల్పాతో కలిసి ప్రమాదంగా ఉన్న గర్భసంచిని అత్యాధునిక…మెరుగైన పరికరాలతో తొలగించారు. మరో గర్భసంచితో చిన్నరంగమ్మ క్షేమంగా ఉంది.  వంద మందిలో ఒకరికి రెండు గర్భసంచులు ఉంటాయని, ఇలాంటి అరుదైన కేసు ఎప్పుడు రాలేదన్నారు గైనకాలజిస్ట్​ డా. కావ్య కంచర్ల. అమీలియో హాస్పిటల్​లో అత్యాధునిక పరికరాలతో… అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారని, అందుకే చిన్నరంగమ్మను తక్కువ సమయంలో శస్ర్తచికిత్స చేసి ప్రమాదం నుంచి తప్పించినట్లు ఆస్పత్రి ఎండి. డా. లక్ష్మీ ప్రసాద్​ చాపే వెల్లడించారు.

About Author