‘అమీలియో’ లో… ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ వైద్య సేవలు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/10075.jpg?fit=600%2C468&ssl=1)
హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ చాపే
కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని అమీలియో హాస్పిటల్ లో ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ కింద రోగులకు ఉచిత క్యాన్సర్ వైద్య సేవలు అందించనున్నట్లు హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ చాపే తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. రోగులకు ఆరు నెలలుగా క్యాన్సర్ వైద్య సేవలు అందిస్తున్నామని… ఈ నెల 10న హాస్పిటల్ కు ఎన్.టి.ఆర్. ఆరోగ్య శ్రీ వర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక వార్డులు, బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. సర్జికల్ అంకాలజిస్ట్ డా. చంద్రశేఖర్ విహారి, మెడికల్ అంకాలజిస్ట్ డా. రేవతి, రేడియోషన్ అంకాలజిస్ట్ డా. లక్ష్మీ శ్రీనివాస్ , టెక్నిషియన్స్, రేడియోషన్స్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఇక నుంచి నిత్యం క్యాన్సర్ రోగులకు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండి డా. లక్ష్మీ ప్రసాద్ చాపే స్పష్టం చేశారు. క్యాన్సర్ రోగులు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద ఇచ్చే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.