NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంకో నెల‌లో.. క‌రోన నాలుగో వేవ్ మొద‌ల‌వుతుందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెరుగుతున్న కొవిడ్‌ కేసులు నాలుగో వేవ్‌కు సంకేతమని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ డి.రణదీప్‌ అంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే.. నాలుగో వేవ్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. థర్డ్‌వేవ్‌ మాదిరిగానే కొద్దిపాటి లక్షణాలుండడమో.. పూర్తిగా లక్షణాలు లేకపోవడం కనిపించవచ్చన్నారు. ముందుజాగ్రత్తలు, మాస్కులధారణతో దాన్ని ఎదుర్కోవచ్చని వివరించారు. కొవిడ్‌-19 టెక్నికల్‌ సలహా మండలి సభ్యుడు, బెంగళూరులోని జయదేవ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియోవాస్క్యులర్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ కూడా కేసులు నెమ్మదిగా పెరగుతున్నాయని.. ఇది మరో మూడు నాలుగు వారాల్లో ఫోర్త్‌వేవ్‌ రావొచ్చనడానికి సంకేతమని పేర్కొన్నారు.

                                       

About Author