ఏపీ టిడ్కోలో.. కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రారంభం : జే.సీ (ఆసరా)
1 min read– జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు…..
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కోవిడ్ నేపథ్యంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏపీటిడ్కోసెంటర్స్ నందు త్వరలో కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్ నందు కోవిడ్ కేర్ సెంటర్స్ నోడల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో అన్ని ఏపీ టిడ్ కో సెంటర్స్ నందు త్వరలో కోవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కోవిడ్ కేర్ సెంటర్లలో పని చేస్తున్న నోడల్ అధికారులు మరియు వారి క్రింది సిబ్బంది వారికి కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించాలన్నారు.
ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, త్రాగు నీరు, పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే కరోనా బాధితులకు అన్ని వసతులు ఉండేటట్లు చూడాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామ గిడ్డయ్య, కోవిడ్ కేర్ సెంటర్ల నోడల్ ఆఫీసర్ డిడి సోషల్ వెల్ఫేర్ సూర్య ప్రతాప్ కుమార్ రెడ్డి, అన్ని కోవిడ్ కేర్ సెంటర్ల నోడల్ అధికారులు, ఎస్ ఈ ఆర్డబ్ల్యూఎస్ విద్యాసాగర్, ఏస్ ఈ టిడ్కో రాజశేఖర్, పి ఒ ఎస్ ఎస్ ఎ వేణుగోపాల్, ఏపి టూరిజం ఈఈ ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.