NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

1 min read

జిల్లాలో 30 కేంద్రాలలో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు, కర్నూలు:  కర్నూలు ఫిబ్రవరి 21  జిల్లాలో ఈనెల 23 వ తేదీన నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పరీక్షలను పకడ్బందీగా  నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో  ఏపీపీఎస్సీ గ్రూప్ -2  మెయిన్స్ పరీక్షల నిర్వహణ పై  లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో  30 కేంద్రాలలో 9993 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. పరీక్షల నిర్వహణ ను సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..పరీక్షల నిర్వహణకు జాయింట్ కలెక్టర్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ గా వ్యవరిస్తారని తెలిపారు.. ప్రతి అంశాన్ని సూక్ష్మ స్థాయిలో ప్లాన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.. ప్రశ్న పత్రాలను తీసుకు వెళ్లడం, ఆన్సర్ షీట్ లు తీసుకు రావడానికి సంబంధించి  జాయింట్ కలెక్టర్, డిఆర్వో, లైజన్ ఆఫీసర్స్ బాధ్యత తీసుకుంటారని, పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ  మాత్రం చీఫ్ సూపరింటెండెంట్ లదే బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.. ప్రశ్న పత్రాల ను  సెంటర్లకు పోలీస్ సెక్యూరిటీతో  క్లోజ్డ్ వాహనాలలో తీసుకొని వెళ్లాలని కలెక్టర్ లై జన్ ఆఫీసర్ లకు సూచించారు.. చీఫ్ సూపరింటెండెంట్ లకు అందచేయాలన్నారుపరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అని  లైజన్ ఆఫీసర్లు ఈరోజే విజిట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించాలని, అలాగే అభ్యర్థులను నిషేధించిన వస్తువులు తీసుకురాకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు..కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్  షాపులను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ఇతర సిబ్బంది వద్ద కూడా ఫోన్ లు ఉండకూడదని కలెక్టర్ ఆదేశించారు..పరీక్షల నిర్వహణ కు సంబంధించి లైజన్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్ లు ఏపీపీఎస్సీ నుండి వచ్చిన ఆదేశాలను, సూచనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 23 వ తేదీ ఉదయం 5.30 గంటలకు  కలెక్టరేట్ కు వచ్చి స్ట్రాంగ్ రూం వద్ద నుండి ప్రశ్న పత్రాల ను తీసుకుని వెళ్లాలని లైజన్  ఆఫీసర్ లను ఆదేశించారు.. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.30 నుండి అభ్యర్థులను లోపలికి  అనుమతించడం జరుగుతుందన్నారు..అభ్యర్థులు ఉదయం జరిగే పరీక్షలకు  9.45  తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షలకు 2.45 తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించకూడదని జేసీ తెలిపారు.. పోలీస్ సిబ్బంది  8.30 కే  కేంద్రాలకు  కేంద్రంలోకి వచ్చే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని వెళ్లకుండా చూడాలన్నారు.  అర్థగంట ముందుగానే ఓఎంఆర్ షీట్స్  అర గంట ముందుగా పరీక్ష హాల్ లోకి పంపించాలన్నారు.అభ్యర్థులకు నియమ నిబంధనల ప్రకారం  సీటింగ్ అరేంజ్మెంట్  చేయాలన్నారు. పరీక్షలకు గైరాజరైన వారి ఓఎంఆర్ సీట్స్ లను కవర్లో ఉంచి సీల్ చేయవలసి ఉంటుందన్నారు. అలాగే అన్ యూజ్డ్ క్వశ్చన్ పేపర్ లను భద్రపరచాలన్నారు..పరీక్షా సమయం పూర్తి అయ్యేంతవరకు అభ్యర్థులను బయటకు పంపకూడదన్నారు..పరీక్ష కేంద్రం నుండి  అభ్యర్థులు పరీక్షలు పూర్తి అయ్యేవంతవరకు బయటికి వెళ్లరాదన్నారు. ఎక్కడైనా మాల్ ప్రాక్టీసెస్ జరిగితే వెంటనే పోలీస్ కు సమాచారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, అడిషనల్ ఎస్పీ అడ్మినిస్ట్రేటివ్ హుస్సేన్ పీరా, ఏఆర్  అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ,డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ,కర్నూలు ఆర్డీవో సందీప్, ఏపీపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ కుమార్ రాజు, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వి బాబురావు, సెక్షన్ ఆఫీసర్లు బ్రహ్మేశ్వర రావు, కె.సుధాకర్ బాబు, ఏ ఎస్ ఓ లు కెఎస్ఎస్ అనిల్ కుమార్, టి ఆంజనేయులు, ఏ. యోగేష్,  లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లు   పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *