బుధవారపేటలో.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరంలోని స్థానిక 15 వ వార్డ్ బుధవార పేట నందు గల 35వ సచివాలయం పరిధిలో మంగళవారం కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ కి వీధుల్లో ప్రజలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. గడప గడప కార్యక్రమంకు ప్రజల నుంచి విశేషా స్పందన లభించింది. ప్రభుత్వ పధకాలు గురించి ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి పొందిన లబ్దినీ తెలుపుతూ సంక్షేమ పధకాలు ఎన్ని రూపాలలో ప్రభుత్వం ప్రజలకు బాసటగా నిలుస్తుందో ప్రజలకి వివరించారు. వీధుల్లో ఉన్న సమస్యలు అలాగే ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు కూడ తెలుసుకొని పరిష్కరిస్తాము అని తెలియజేశారు. విధుల్లో అక్కడక్కడా బోర్లు మరమ్మత్తులు వెంటనే పర్షికరించారు కర్నూల్ శాసనసభ్యులు. ముఖ్యంగా డ్రైనేజీ మరియు రోడ్లు ఇబ్బంది అలాగే పలు చోట్ల ఎన్నో ఏళ్లుగా కరెంటు తీగల వల్ల ఇబ్బంది కలుగుతుంది అని ప్రజలు తెలియజేశారు. ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు సకాలంలో అందుతున్నాయి అని మునుపటి ప్రభుత్వాలు చేయని విధంగా ఇంటి దగ్గరికే సంక్షేమ పధకాలు వస్తున్నాయి అని ప్రజలు సంతోషంగా వ్యక్తపరుస్తున్నారని కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక 15వ వార్డు పార్టీ నాయకులు కేదార్ నాథ్, వెంకటేశ్వరమ్మ, పులి జాకబ్, సుగుణ, వాని, వరలక్ష్మి, రాధ, నాగమణి, అమృత్, దినకర్, సురేఖ, వసంత్, జస్వంత్ అలాగే సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అలాగే విద్యుత్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.