PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెరుకులపాడులో… వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెల్దుర్తి : వెల్దుర్తి మండలం చెరుకులపాడు  గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి  పాల్గొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కంగాటి వాసంతమ్మ,వెల్దుర్తి సింగల్ విండో ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి, సర్పంచ్ బోయ రాములమ్మ, వైస్ ఎంపిపి కురువ రాజేశ్వరి తో కలిసి పార్టీ జెండా ను ఆవిష్కరించారు.అనంతరం పాడి రైతుల పశువులకు వర్తించే వైయస్సార్ పశు బీమా పథకం, పాడి పశువులు మరణిస్తే నష్టపోయిన పశుపోషకులకు భీమా చెల్లింపు కార్డును ఎమ్మెల్యే  పాడి రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author