‘కో ఆపరేటివ్’లో…అవినీతి చేప..
1 min readఅసిస్టెంట్ రిజిష్ట్రర్ ఇల్లు, ప్రైవేట్ కార్యాలయాలపై ఏసీబీ సోదాలు
కోటిన్నరకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తింపు…
40 తులాల బంగారం.. ఇళ్ల స్థలాల పత్రాలు స్వాధీనం
ఏసీబీ డీఎస్పీ శివనారాయణ వెల్లడి
పల్లెవెలుగు, కర్నూలు: ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ… కోట్లు గడిస్తున్నారు. ఉద్యోగానికి… ఆదాయానికి సంబంధం లేనంతగా ఆస్తులు కూడబెట్టడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా వేశారు. కర్నూలు నగరంలోని కో ఆపరేటివ్ శాఖలో డివిజనల్ కో ఆపరేటివ్ కృష్ణానగర్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిష్ర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న పి. సుజాత ఇల్లు, బంధవుల ఇళ్లపై, ప్రైవేట్ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ శివనారాయణ నేతృత్వంలో అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నారన్న సమాచారంతో కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో కృష్ణానగర్‌లోని డివిజనల్ కో ఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిష్ట్రర్గా విధులు నిర్వర్తిస్తున్న పి.సుజాత ఇంటిపై, ప్రైవేట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఒకేసారి తనిఖీ చేపట్టారు. ముద్దాయి పి.సుజాత తన పేరిట.. కుటుంబ సభ్యుల పేరిట స్థిరచరాస్తులు కలిగి ఉండటంతో కేసు నమోదు చేశారు.
కర్నూలులో అక్రమ ఆస్తులు:
1) శ్రీరాంనగర్ కాలనీ లో G+2 ఇల్లు, 2) అశోక్ నగర్లో G+1 ఇల్లు, 3) కస్తూరి నగర్ లో ఇల్లు, 4) బుధవారిపేట లో G+1 రెండు షాప్స్.5) బుధవారిపేట లో ఒక షాప్, 6)2.53 ఎకరముల వ్యసాయ భూమి, 7) కర్నూల్ టౌన్ చుట్టు ప్రక్కల రూ.2316000 /- ఎనిమిది ఇండ్ల స్థలాలకు సంబంధించి పత్రాలు, 8) 40 తులాల బంగారం, 9) Tata Vista Car , Honda Activa scooty, 10) ఎలక్ట్రానిక్స్ పరికరములు , బంగారం మరియు గృహోపకరణాలతోపాటు 11) Rs.8,21,000/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు మొత్తం 1,78, 37,000/- విలువగల ఆస్తులను సంపాదించినట్లు వెల్లడి అయింది. ఈ ఆధికారి దాదాపు 1,80,07,000/–విలువగల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, సదరు అధికారిణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని,ఆ తరువాత కర్నూలు ACB స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ వెల్లడించారు.
అవినీతి అధికారిణి.. గురించి…:
అవినీతి అధికారిణి పి. సుజాత స్వగ్రామం కర్నూలు. ఆమె 1993 డిసెంబరు 09న జూనియర్ ఇన్స్పెక్టర్గా కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందారు. తరువాత Senior inspector గా ప్రమోసన్ పొంది కర్నూలు మరియు ఆత్మకూరులో పని చేసినారు. ఆ తరువాత 2009 లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ప్రమోషన్ పొంది ఆత్మకూరు మరియు కర్నూలు లలో పని చేసి నారు. ప్రస్తుతము ఈమె కర్నూలు లో Divisional Cooperative office లో Asst Registrar గా పని చేస్తున్నారు. అవినీతికి రుచిమరిగిన సదరు అధికారిణి తనపేరిట.. కుటుంబ సభ్యుల పేరిట స్థిరచరాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.