NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కున్నూరులో.. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం

1 min read

– గ్రామంలో ఇంటింటికి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే బివి
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: జాతీయ టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల్ ఆదేశాల మేరకు గోనెగండ్ల మండలంలోని కున్నూరు గ్రామంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు డాక్టర్ బి వి జయనాగేశ్వర రెడ్డి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి టిడిపి జెండావిష్కరణ చేసి,టిడిపి వ్యవస్థాపకులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు ,మాజీ మంత్రి వర్యులు కీ శే బి వి మోహన్ రెడ్డి గారి చిత్రపటా లకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి అధికార వైసిపి పార్టీ హయాంలో గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని కుటుంబంలో నిరుద్యోగ సమస్య, అడ్డగోలు నిత్యావసర ధరలు, మద్యపానం, కుంటుపడిన అభివృద్ధి, ఇసుక మాఫియా, త్రాగునీటి సమస్య, అవినీతి, మహిళల భద్రత, కరెంటు సమస్య, రోడ్ల సమస్య, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధరలు, నిలకడలేని పాలన, రాజధాని రాజకీయాలు వంటి ఏ రకమైన సమస్య ఉందొ అడిగి తెలుసుకుని 9261292612 ఫోన్ నెంబర్ కు వారి మొబైల్ నుండి మిస్డ్ కాల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author