PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధిలో.. ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం..

1 min read
మాట్లాడుతున్న నగర మేయర్​ బీవై రామయ్య

మాట్లాడుతున్న నగర మేయర్​ బీవై రామయ్య

కర్నూలు చెత్తరహిత నగరంగా మారుద్దాం..
– చెత్తకుండీలు తీసిన చోట.. అక్కడెవరు చెత్త వేయరాదు..
– త్వరలో ప్రజలకు అవగాహన కల్పించనున్న కార్పొరేటర్లు
– నగర మేయర్​ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్పూలు కార్పొరేషన్​: స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా కర్నూలును పరిశుభ్రంగా, చెత్తరహిత నగరంగా మార్చేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కార్పొరేటర్లు తమవంతు భాగస్వామ్యం కావాలని నగర మేయర్​ బీవై రామయ్య, మున్సిపల్​ కమిషనరు డీకే బాలాజి సూచించారు. శుక్రవారం నగర పాలక కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో నగర పాలక మేయర్ బి.వై.రామయ్య, నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ బి.వై.రామయ్య మాట్లాడుతూ..నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేoదుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది కలిసి ప్రజలను చెత్త వేయకుండా అవగాహన కల్పించనున్నామని తెలియజేశారు. కార్పొరేటర్లు కూడా తమ వార్డుల్లో ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అందరూ..సహకరించాలి..
అనంతరం నగర పాలక కమిషనర్ డి .కె. బాలాజీ మాట్లాడుతూ…కర్నూలు నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుందామని..ఇందుకు కార్పొరేటర్లు, ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా శనివారం రోజున తమ వార్డులో తీసి వేసిన డంపర్ బిన్ చోట ఉన్న చోటున చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై మొదట దృష్టి పెట్టబోతున్నామన్నారు. కమిషనర్ డి.కె బాలాజీ, మేయర్ బి.వై. రామయ్య కె.ఎం.సి గొడుగులను కార్పొరేటర్ల కు అందజేశారు. అనంతరం నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ గారిని మేయర్, కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, నగర పాలక అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ పద్మావతి, హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు.

About Author