NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార్యను చంపిన భర్త…

1 min read

​ – ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..
పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. అనుమానమో.. గొడవలో తెలియదు కానీ… భార్యను ఉరి వేసి చంపేశాడు…. ఆత్మహత్యగా చిత్రకరించేందుకు యత్నించాడు ఆ కిరాతక భర్త. ఎమ్మిగనూర్ రూరల్ సిఐ మంజునాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోనెగండ్లకు చెందిన కటికె సుభాన్​, షేకన్​బీ దంపతులకు కుమార్తె యాస్వీన్​ బీ (20), బీబీ, గౌండ హాసన్​ దంపతుల కుమారుడు రహిం (25) ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించినప్పటికీ…. అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించి ప్రేమ వివాహం జరిపి.. వేరే కాపురం పెట్టించారు. వీరు కొంత కాలం పెద్దకట్ట దగ్గర చికెన్ పకోడా బండి పెట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారంలో భర్త రహీంకు భార్య చేదోడువాదోడుగా నిలిచేది. అనుమానమో… వేధింపులో.. గొడవలో.. కారణమేమిటో తెలియదు కానీ మంగళవారం యాస్వీన్​ బీ ఇంట్లోని ఫ్యాన్​కు ఉరి వేసుకుని మృతి చెందింది. ఇరుగుపొరుగు వారి సమాచారంతో విచారణ చేసిన ఎమ్మిగనూరు రూరల్​ పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తరచూ గొడవ పడేవారమని, వేధింపులు తాళలేకే ఉరి వేసి చంపినట్లు ముద్దాయి రహీమ్​ పోలీసుల విచారణలో తెలిపినట్లు రూరల్​ సీఐ మంజునాథ్​ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మంగళవారం సాయంత్రం సీఐ మంజునాథ్​ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో ఎస్ ఐ సురేష్,పోలీస్ సిబ్బంది ఉన్నారు.


About Author