PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకుమెరుగైన ఆధునిక కంటి పరీక్ష సేవలు..

1 min read

రూ : 27 లక్షల విలువగల కంటి పరీక్షల ఆధునిక సామాగ్రితో ప్రారంభం..

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు కంటివైద్య సేవలు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని పకగ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. మంగళవారం స్ధానిక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కంటివైద్య విభాగం నందు కంటి పరీక్షలకు సంబంధించిన ఆధునిక కంటి వైద్య పరీక్షల సామాగ్రి సుమారు రూ. 27 లక్షలు ఖరీదుచేసే పరికరాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆధునిక పరీక్షల పరికరాల ద్వారా మేలైన కంటిచూపును పొందే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి కంటివిభాగంలో ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.  కంటిపరీక్షతోపాటు కళ్లఅద్దాలు, ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు.  మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన పారిశుధ్యం ఉండాలని కలెక్టర్ తెలిపారు.  ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకం ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఆసుపత్రులకు వచ్చే రోగులపట్ల ప్రేమాభిమానాలతో సేవలు అందించాలని కోరారు.  రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వఆసుపత్రులను ఆధునీకరించే పనిలో భాగంగా, కార్పోరేట్ వైద్యాన్ని ప్రతి పేదవాడికి చేరువ చేసే సంకల్పం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరీదైన సామాగ్రిని క్రొత్త వైద్య బోధనాసుపత్రిగా మారిన మన ఏలూరుప్రభుత్వ ఆసుపత్రి కంటి వైద్య విభాగమునకు అందించారని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. యు. అగ్నేస్ విజయ   ఆధునికి కంటి వైద్య పరికరాలు గురించి మాట్లాడుతూ గ్లకోమా (నీటి కాసులు) వ్యాధి తీవ్రత మరియు పురోగతిని తెలియజేసే పెరిమీటర్ సుమారు 11 లక్షలు, మెల్ల కన్ను వ్యాధిని నిర్దారించే పరికరం సైనాప్టోఫోర్ సుమారు 2 లక్షలు, కార్పోరేట్ స్థాయి ఎల్ సిడి చూపు నిర్ధారణ పరికరాలు 3 ఒక్కొకటి 40,000 వేలు, రెటీనా పరీక్షలు డయాబెటిక్ రెటినోపతి లాంటివి పరీక్ష చేసే  ఇన్ డైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ (indirect ophthalmoscope) 70,000 ఖరీదు చేసేవి  2  సాధారణ రెటీనా పరీక్షలు చేయడానికి 90 D లెన్స్ లు 3 (ఒక్కొక్కటీ 20,000), ఎఆర్ కె మిషన్, కంటి వక్రీభవన దోషాలను వేగంగా గుర్తించడానికి వాడే కంప్యూటరు పరీక్ష పరికరం ఒకటి సుమారు 2,80,000 సాధారణ కంటి పరీక్షలు చేయాడానికి, కంట్లో నలకలు తీయడానికి ఉపయోగపడే స్లిట్ ల్యాంప్ (SLIT LAMP) పరికరంతో పాటు కంటిలో ఒత్తిడిని కొలిచే అప్లానేషన్ టోనో (APPLANATIONTONO) మీటర్ 3, ఒక్కోటి 2.70.000 పరికరాలను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చేతులమీదుగా ప్రారంభించడం జరిగిందని  ఆమె తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ స్వయంగా కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది.  తదుపరి కంటి పరీక్షల విభాగాన్ని, వార్డులను పరిశీలించారు.   కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగం డా. మల్లిఖార్జున్, డిసిహెచ్ పాల్ సతీష్ కుమార్, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author