PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృద్ధిలో.. చైనాను మించిన భార‌త్

1 min read

పల్లెవెలుగువెబ్​: భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రుగులు పెడుతోంది. క‌రోన ముందు స్థాయికి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి  వృద్ధి రేటు 8.4 శాతానికి పెరిగింది. దేశం వృద్ధి పథంలో పయనించడం వరుసగా ఇది నాలుగో త్రైమాసికం. అంతేకాదు, ఈసారి వృద్ధి విశ్లేషకుల అంచనాలు సైతం మించింది. లో బేస్‌ ఎఫెక్ట్  ఇందుకు ప్రధానంగా దోహదపడినప్పటికీ, జీడీపీ కరోనా ముందు స్థాయికి మించి నమోదైందని జాతీయ గణాంకాల కార్యాలయం  తాజా డేటా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21 లో సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు వార్షిక ప్రాతిపదికన  మైనస్‌ 7.4 శాతానికి క్షీణించింది. అంతకంటే ముందు త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లోనైతే ఏకంగా మైనస్‌ 24.4 శాతానికి పతనమైంది. కరోనా తొలి దశ వ్యాప్తి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌, తదనంతర కఠిన ఆంక్షలు అందుకు కారణమయ్యాయి. ఈ ఏడాదిలో కరోనా రెండో దశ వ్యాప్తి దేశాన్ని కుదిపేసిన ప్పటికీ.. రాష్ట్రాలు స్థానిక, పాక్షిక లాక్‌డౌన్‌లతో సరిపెట్టడంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి భారత్‌ 20.1 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. చైనా కేవ‌లం 4.9 శాతం వృద్ధిని న‌మోదు చేసింది. దీంతో చైనా కంటే భార‌త్ ఈ విష‌యంలో ముందుంది.

About Author