జలకనూరులో మా నమ్మకం నువ్వే జగనన్న
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో గ్రామ వైసీపీ నాయకులు రామలింగారెడ్డి,సిరిగిరి పుల్లయ్య, సచివాలయ మండల కన్వీనర్ రవి,మైనార్టీ నాయకులు అబ్దుల్ ఘని ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.గత రెండు రోజులుగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తూ గత నాలుగు సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మనకు ఇంకా ప్రభుత్వ పథకాలు అందాలంటే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ప్రజలకు వివరించారు.తర్వాత ప్రతి ఇంటికీ జగనన్న స్టిక్కర్లను అతికించారు.